Homeఆంధ్రప్రదేశ్బాపట్లఈపురుపాలెంలో దళిత మహిళలపై మూకుమ్మడి దాడి!

ఈపురుపాలెంలో దళిత మహిళలపై మూకుమ్మడి దాడి!

భూమి వివాదంలో 10 మందిపై ఆరోపణలు.. ఇద్దరికి గాయాలు

చీరాల, అక్టోబరు 8: చీరాల మండలం ఈపురుపాలెం ఆటోనగర్ సమీపంలో భూమి వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. భూమిలో పనులు చేసుకుంటున్న ఇద్దరు దళిత మహిళలపై బాపట్ల నుంచి వచ్చిన సుమారు 10 మంది వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితులు ఆరోపించారు.

దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని, ఈ ఘటనలో గాయపడిన మహిళలకు చీరాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపారు. తాము సుమారు 30 ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నామని బాధితులు పేర్కొన్నారు.

దాడి ఘటనతో భయాందోళనకు గురయ్యామని, తమకు భద్రత కల్పించి దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ మేరకు ఈపురుపాలెం ఎస్సీ కాలనీకి చెందిన దేవరపల్లి రమేష్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular