Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లితప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా

తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తా

-మాజీ కౌన్సిలర్ జగదీశ్వరి

నర్సీపట్నం, పెన్ పవర్ :

తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి, సోషల్ మీడియా వేదికగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తానని మాజీ కౌన్సిలర్ జగదీశ్వరి హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం గొర్లి రాజబాబు, అతని భార్య శైలజలపై నర్సీపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో తనను రాజకీయంగా అణగదొక్కెందుకు కొన్ని దుష్టశక్తులు పన్నిన కుట్రగా భావిస్తున్నానన్నారు. శనివారం ఉదయమే వీరిద్దరూ తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేశారని ఈ విషయంపై సీఐ గఫూర్ కు ఫోన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఇంతలోనే సోషల్ మీడియాలో ఉద్యోగం ఇప్పిస్తానని తాను మోసం చేసినట్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినట్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నానని, కౌన్సిలర్ స్థాయి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇప్పించగలమో కుట్ర దారులకే తెలియాలన్నారు. రాజకీయంగా తన పరువు మర్యాదలను తీసేందుకు ప్రయత్నించిన వారిద్దరిపైన పరువు నష్టం దావా వేస్తానని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular