గూడెంకొత్తవీధి, పెన్ పవర్, అక్టోబర్ 23:అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం రింతాడ–2 ఎంపీటీసీ స్థానానికి జనసేన పార్టీ అభ్యర్థిగా గబులంగి గణేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఎబులం గ్రామానికి చెందిన గణేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాబు నాయక్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన నామినేషన్ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అభ్యర్థి గబులంగి గణేష్ వెంట ఉండి తమ మద్దతు తెలిపారు.

