Homeతెలంగాణగార్లను కరువు మండలంగా ప్రకటించాలి

గార్లను కరువు మండలంగా ప్రకటించాలి

 

గార్ల, పెన్ పవర్, అక్టోబర్ 31:

వర్షాభావ పరిస్థితులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు కరువు సహాయం వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ గిరిజన సంఘం మండల నాయకుడు భూక్యా శ్రీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ. గార్ల మండలంలోని వ్యవసాయం పూర్తిగా వర్షాధారంగా ఉండటంతో రైతులు ఏటా ఒకే పంటపై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో వాతావరణ ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడక్కడ సాగు చేసిన వరి పంటలు సైతం నీటి ఎద్దడితో ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. పత్తి, మిర్చి పంటల దిగుబడిపై కూడా అనిశ్చితి నెలకొందని, దీంతో పేద, మధ్యతరగతి రైతులతో పాటు గిరిజన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ఏడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించి, ఏజెన్సీ ప్రాంతమైన గార్ల మండలాన్ని జాబితాలో చేర్చకపోవడం విచారకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి గార్ల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు రైతులకు తగిన కరువు సహాయం అందించాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular