ePaper
Monday, March 23, 2026
spot_img
ePaper
Homeతెలంగాణ'మల్లంపేట్‌'లో..! చర్యలు ఉండవట..? కలెక్షన్‌లేనా..?

‘మల్లంపేట్‌’లో..! చర్యలు ఉండవట..? కలెక్షన్‌లేనా..?

📰 Generate e-Paper Clip

 

అయినా తీరుమారని దుండిగల్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్..! అక్రమ కట్టడాలకే ప్రాధాన్యత..

టిజి-బిపాస్ చట్టానికే దిక్కులేదు..! నిబంధనలు పాటించేవారే లేరు..!

తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్.. టిడిఆర్ తప్పనిసరి..!

కొత్త ‘చైన్‌మెన్‌‌’లను నియమించినా.. అక్రమ నిర్మాణాలపై చర్యలు శూన్యం..

టౌన్‌ప్లానింగ్ అధికారులే అక్రమ నిర్మాణాల నియంత్రణలో‌ బాధ్యత లేదు..?

ఔట్ సోర్సింగ్‌ సిబ్బందికి బాధ్యత ఉంటుందా..? అంటూ ఆరోపణలు..

గ్రూప్-4 నుండి వచ్చిన వార్డు ఆఫీసర్‌లు చైన్‌మెన్‌‌లకు అర్హత లేదా..?

ఎలాంటి పర్మిషన్‌ లేకుండా అక్రమ కమర్షియల్ షట్టర్‌లకు నోటీసులు..

నోటీసులు జారీచేసి నెలలు గడిచినా చర్యలు శూన్యం..

సంబంధిత అక్రమ కమర్షియల్ షట్టర్‌లలో అధికారుల అండతో దుకాణాలు షురూ..?

టిజి-బిపాస్ చట్టాన్ని చుట్టంగా మలుచుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు..?

ఏసిబి దాడులతో టిపిఎస్‌ వద్ద భారీగా నగదు బదిలీలు లభించి సస్పెండ్..

అయినా తీరుమారని దుండిగల్‌ సర్కిల్‌లో..! అక్రమ కట్టడాలకే ప్రాధాన్యత..

టిజి-బిపాస్ చట్టానికే దిక్కులేదు..! నిబంధనలు పాటించేవారే లేరు..!

తెలంగాణలో కొత్త బిల్డింగ్ రూల్స్.. టిడిఆర్ తప్పనిసరి ..!

దుండిగల్‌, పెన్ పవర్, మార్చి 22:

దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ విభాగం పరిధిలో వందలాది అక్రమ నిర్మాణాలు అధికారుల అండతోనే కొనసాగుతున్నట్టు, చర్యలకు నోచుకోని ఆ అక్రమ నిర్మాణాలతో స్పష్టమవుతుంది.. మరోవైపు దుండిగల్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌కు మల్లంపేట్‌‌ గుండె కాయ లాంటిదనే ప్రచారం పలువురిని ఆశ్చర్య పరుస్తుంది.. అత్యధికంగా కుప్పలు తెప్పలుగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా..! వసూళ్ళతోనే సరిపెడతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.. బహుదూర్‌పల్లి- బౌరంపేట్ ఏరియాలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రశ్నించేందుకు కొత్త చైన్‌మెన్‌‌ లకు ఫోన్ చేసినా స్పందించడంలేదు.. టౌన్‌ప్లానింగ్ ఏసిపికి పలుమార్లు ఫోన్ చేసినా సమాధానం శూన్యం..కొత్త టిపిఎస్ అదేతీరు.. నూతన చైన్‌మెన్‌‌ల నియామకం జరిగి వారం తిరగ ముందే తమ నైజాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు కూడా గుప్పుమంటున్నాయి..?

పాత చైన్‌మెన్‌‌లు లేరు.. అంతా మేమే..?

మరోవైపు “బిల్డర్‌లు- అక్రమ నిర్మాణ దారులు, అక్రమ షెడ్ల నిర్మాణ దారులతో” నూతన చైన్‌మెన్‌‌లు తమదైన శైలిలో ప్రచారం మొదలైందట.. ఇంతకు ముందు చైన్‌మెన్‌‌లు ప్రస్తుతం టౌన్‌ప్లానింగ్‌లో లేరని, కొత్తగా మేము వచ్చామని, ఏదైనా తమతోనే మాట్లాడాలని చెపుతున్నట్టు సమాచారం.. దీంతో నూతన చైన్‌మెన్‌‌లు కూడా “అప్‌డేట్” అయ్యారని తేటతెల్లం చేస్తోంది.. గతంలోనూ మల్లంపేట్‌‌లో ఓ తాత్కాలిక చైన్‌మెన్‌‌ నియామకం, ఇదే తరహాలో, 2 నెల్లలోనే దాదాపు 20 అక్రమ నిర్మాణ దారులతో “మాట ముచ్చట” ముగించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి.. ప్రస్తుతం ఆ 20 అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోకుండా జాగ్రత్తలు వహిస్తున్నారట..! గత తాత్కాలిక చైన్‌మెన్‌‌, ఆ తర్వాత నియమించిన, ప్రస్తుతం విధుల్లో ఉన్న చైన్‌మెన్‌‌లను, చర్యలు తీసుకోవద్దని ప్రాదేయ పడుతున్నట్టు వినికిడి.. ఇప్పుడు అర్ధమవుతుంది కదా..దుండిగల్‌ సర్కిల్-59 సిఎంసి పట్టణ ప్రణాళికలో జరుగుతున్న యవ్వారం.. టిజి-బిపాస్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని టౌన్‌ప్లానింగ్ విభాగంలో చేస్తున్న ఈ అరాచకం పతాక స్థాయికి చేరుకుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఇప్పటికైనా దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్‌పై, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు..

టిజి-బిపాస్ అమలుకే దిక్కు లేదు..? కొత్తగా బిల్డింగ్ రూల్స్..?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం అక్రమ కట్టడాల నియంత్రణకు, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో అమలు చేసిన “టిజి-బిపాస్ చట్టం 2019-20” అమలు చేయడానికే దిక్కులేదంటే..! కొత్తగా బిల్డింగ్ రూల్స్ అమలు చేశారు..? ఈ రూల్స్ ఇప్పటికే వక్రమార్గంలో అమలు జరుగుతున్న విషయం తెలిసిందే కాదా..! అనుమతులు 2 అంతస్తులకు.. నిర్మాణం 4-5 అంతస్తులు అక్రమ పద్దతిలో కొనసాగుతున్నాయి.. ఇందులో వ్యత్యాసం ఏమిటంటే, ఇప్పటి వరకు వక్రమార్గంలో నిధులు అధికారుల జేబులకి..! ఇప్పటి నుండి సక్రమ మార్గంలో ప్రభుత్వ ఖజానాకు ఫీజులు చేరుతాయి అంతే..! అయినప్పటికీ అక్రమ అదనపు అంతస్తులు నియంత్రిచగలరా..? టిజి-బిపాస్ చట్టాన్ని ధ్వంసం చేసిన టౌన్‌ప్లానింగ్ వ్యవస్థకు ఈ కొత్త బిల్డింగ్ రూల్స్ ఒక లెక్కా..?

మున్సిపల్ వ్యవస్థలో కీలకమైన విభాగం టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అయినప్పటికీ..! ఆ విభాగం ప్రస్తుతం వసూళ్ళ కోసమే, చైన్‌మెన్‌‌ల నియామకం తయారైందని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.. దుండిగల్‌ సర్కిల్-59 పరిధిలోని వందలాది అక్రమ కట్టడాల తోపాటు.. బహుదూర్‌పల్లి, దొమ్మర పోచంపల్లిలో భారీ అక్రమ షెడ్ల నిర్మాణాలు చేపట్టడంలో టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారుల అనుగ్రహం లేకుండా సాధ్యం కాదని ఆరోపణలు లేకపోలేదు.. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సూచనలతో చైన్‌మెన్‌‌ల నియామకం జరిగిందో..? లేక దుండిగల్‌ సర్కిల్ టౌన్‌ప్లానింగ్ అధికారుల నియామకమో తెలియదు కానీ..! 14 మది గ్రూప్-4 నుండి వచ్చిన అధికారులు ఉన్నప్పటికీ..! ముఖ్యమైన టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మెన్‌‌లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular