Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిశ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ నిఘానేత్రం

శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ నిఘానేత్రం

శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ నిఘానేత్రం

-8 సీసీ కెమెరాలు ఏర్పాటు

-ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు

-ఆర్థిక సాయం అందించిన నర్సీపట్నం లారీ యూనియన్

నర్సీపట్నం, పెన్ పవర్ :

నర్సీపట్నం పెద్దచెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మవారి గుడి చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పట్టణ సీఐ గఫూర్ మీడియాకు తెలిపారు. వీటిని మంగళవారం ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు లాంచనంగా ప్రారంభించారని తెలిపారు. 60 వేల రూపాయలు విలువ చేసే సీసీ కెమెరాలకు నర్సీపట్నం లారీ యూనియన్ వారు ఆర్థికంగా సహకరించారని తెలిపారు. రానున్న మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో, రద్దీ నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ రేవతమ్మ, పట్టణ ప్రముఖులు జాలుమూరి జోగారావు, నేరెళ్ళ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular