ePaper
Saturday, March 28, 2026
ePaper
Homeతాజా సమాచారంఓటీటీలోకి రాబోతున్న సుహాస్‌ ‘‌హే బల్వంత్‌’

ఓటీటీలోకి రాబోతున్న సుహాస్‌ ‘‌హే బల్వంత్‌’

📰 Generate e-Paper Clip

  •  ‘‌హే బల్వంత్‌’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ
  • జీ5 ఓటీటీ హక్కులు దక్కించుకున్న సినిమా
  • మార్చి 31 నుండి స్ట్రీమింగ్ ప్రారంభం
  • తెలుగు తో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటు
  • సుహాస్ నటనకు ప్రేక్షకుల ప్రశంసలు
  • శివాని నాగరం అందం, అభినయం ఆకట్టుకున్న అంశాలు
  • రేష్‌, ‌కమెడియన్‌ ‌సుదర్శన్‌ ‌ కీలక పాత్రల్లో మెప్పింపు
  • కామెడీ ప్రధానంగా సాగే సహజమైన కథనం
  • ఫ్యామిలీ ఆడియన్స్‌కు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్
  • ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ సాధించే అవకాశం

 

 

ఫిలిం డెస్క్ పెన్ పవర్ మార్చి 28: ‌

 

కలర్‌ ‌ఫొటో, రైటర్‌ ‌పద్మభూషణ్‌ ‌వంటి చిత్రాలతో తన నటనకు మంచి మార్కులు కొట్టేసిన సుహాస్‌, ఇటీవల ‘హే బలవంత్‌’ ‌చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు. ఫిబ్రవరి 20న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్‌ ‌ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా డిజిటల్‌ ‌హక్కులను దక్కించుకుంది. థియేటర్లలో మిస్‌ అయిన వారందరి కోసం జీ5 ఒక క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చింది. మార్చి 31 నుండి ‘హే బలవంత్‌’ ‌సినిమాను స్ట్రీమింగ్‌ ‌చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉండనుంది. సుహాస్‌ ‌నటనకు తోడు శివాని నాగరం అందం, అభినయం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమాలో సీనియర్‌ ‌నటుడు నరేష్‌, ‌కమెడియన్‌ ‌సుదర్శన్‌ ‌కీలక పాత్రలు పోషించారు. కథ అంతా చాలా సహజంగా, కామెడీ ప్రధానంగా సాగడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ ‌సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు. సమ్మర్‌ ‌హాలిడేస్‌ ‌మొదలవుతున్న క్రమంలో, ఇంటిల్లి పాదీ కలిసి నవ్వుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్‌ అని చెప్పొచ్చు. థియేటర్లలో కంటే ఓటీటీలో సుహాస్‌ ‌సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది, కాబట్టి ‘హే బలవంత్‌’ ‌కూడా డిజిటల్‌ ‌ప్లాట్‌ఫామ్‌ ‌పై రికార్డులు క్రియేట్‌ ‌చేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular