గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 11:గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల కొత్తూరు గ్రామంలో భారీ పాము సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. శనివారం రాత్రి సమీప అడవి నుంచి సుమారు 15 అడుగుల పొడవైన పాము గ్రామంలోకి ప్రవేశించింది.పాము ఓ ఇంట్లోకి దూరడంతో అక్కడి గిరిజనులు భయంతో పరుగులు తీశారు. పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై సుమారు గంటన్నర పాటు శ్రమించి పామును హతమార్చినట్లు తెలిపారు. పాము గ్రామంలో హల్చల్ చేస్తూ కాటు వేసేందుకు ప్రయత్నించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో చంపినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో గ్రామంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జర్రెల కొత్తూరులో భారీ పాము సంచారం – గ్రామస్థుల్లో భయాందోళన
RELATED ARTICLES

