ePaper
Friday, April 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పేటలో అదుపుతప్పిన కారు

పేటలో అదుపుతప్పిన కారు

📰 Generate e-Paper Clip

గుడిసెలోకి దూసుకెళ్లిన వైనం

చిలకలూరిపేట రూరల్, పెన్ పవర్, ఏప్రిల్ 16: 

చిలకలూరిపేట: పట్టణంలోని నరసరావుపేట సెంటర్ వద్ద గురువారం ఒక కారు బీభత్సం సృష్టించింది. నరసరావుపేట వైపు వెళుతున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ఒక గుడిసెలోకి దూసుకుపోయింది. ప్రమాద సమయంలో గుడిసెలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. కారులో ముగ్గురు యువకులు, ఒక మహిళ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు కేకలు వేయడంతో, కారులో ఉన్న వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular