ePaper
Tuesday, April 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుదామనపల్లిలో చెత్త సేకరణపై పర్యవేక్షణ

దామనపల్లిలో చెత్త సేకరణపై పర్యవేక్షణ

📰 Generate e-Paper Clip

గూడెం కొత్తవీధి,పెన్ పవర్, ఏప్రిల్ 20:మండలంలో దామనపల్లి గ్రామ పంచాయతీలో చెత్త నిర్వహణపై పంచాయతీ సెక్రెటరీ ఆర్. లక్ష్మి సమీక్ష నిర్వహించారు. గ్రామంలో డోర్ టు డోర్ చెత్త సేకరణ ప్రక్రియను ఆమె దగ్గరుండి పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి క్లాప్ మిత్రులకు అందజేయాలని సూచించారు. అలాగే ఐవీఆర్ కాల్స్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు.పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు సురక్షితంగా ఉండాలని ఆమె సూచించారు.ఈ కార్యక్రమంలో వీవోఏ పాంగి బాలరాజు మరియు ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular