ePaper
Friday, April 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుఇంటర్ ఫలితాల్లో జీకే వీధి మండల విద్యాసంస్థల మెరుగైన ప్రతిభ

ఇంటర్ ఫలితాల్లో జీకే వీధి మండల విద్యాసంస్థల మెరుగైన ప్రతిభ

📰 Generate e-Paper Clip

  • గూడెంకొత్త వీధి,పెన్ పవర్,ఏప్రిల్ 15: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల కావడంతో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని విద్యాసంస్థలు మంచి ఉత్తీర్ణత శాతం సాధించి ప్రత్యేక గుర్తింపు పొందాయి.మండలంలోని ఏ.పీ.ఆర్ జూనియర్ కాలేజ్ (గర్ల్స్) విద్యార్థినులు ప్రథమ సంవత్సరంలో 96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో శత శాతం (100%) ఫలితాలు నమోదు చేయడం విశేషం.అలాగే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ) విద్యార్థినులు కూడా అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో 94 శాతం, ద్వితీయ సంవత్సరంలో 97 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే ఫెయిల్ అయిన కొద్దిమంది విద్యార్థులు కేవలం ఇంగ్లీష్ సబ్జెక్టులోనే తప్పడం గమనార్హం. మొత్తంగా మండలంలోని విద్యాసంస్థల ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular