ePaper
Tuesday, April 21, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణికి జన్మదిన శుభాకాంక్షలు

మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణికి జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 18: కాజులూరు మండలం బంధనపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ డేగల తిరుమల వేణి గారికి స్థానికులు, నాయకులు,జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించిన తిరుమల వేణి గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేసి ప్రజల మన్ననలు పొందారు. పదవిలో ఉన్న సమయంలోనే కాకుండా, అనంతరం కూడా ప్రజల మధ్య ఉండి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అవసరమైన వారికి సహాయం అందిస్తున్నారు.జనసేన యువ నాయకుడు డేగల నాగేంద్ర (గోల్డ్ మ్యాన్) తల్లిగా తిరుమల వేణి సేవా దృక్పథంతో గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పలువురు అభినందించారు.ఈ సందర్భంగా ఆమెకు మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని, ఆరోగ్యంగా, సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ మేరకు కాజులూరు మండల జర్నలిస్టులు, రాజకీయ నాయకులు,డేగల నాగేంద్ర మిత్రబృదం, తిరుమల ఫంక్షన్ హాల్ స్టాఫ్ , కుటుంబ సభ్యులు తదితరులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular