ePaper
Friday, April 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడతెరుచుకోనున్న ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ప్లాంట్‌

తెరుచుకోనున్న ప్యారీ షుగర్స్‌ రిఫైనరీ ప్లాంట్‌

📰 Generate e-Paper Clip

నష్టాల భారంతో ప్లాంట్‌కు తాళం
బోర్డు నిర్ణయంతో కార్యకలాపాలకు ముగింపు
గ్యాస్ కొరతతో పెరిగిన ఖర్చులు
ప్రమాదాలు, ఆలస్యాలతో మరింత నష్టం
కార్మికులకు యాజమాన్యం సమాచారం

కాకినాడలోని ప్యారీ షుగర్స్ రిఫైనరీ ప్లాంట్ మూతపడటం పారిశ్రామిక వర్గాల్లో కలకలం రేపింది. వరుస నష్టాలు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ కాకినాడ, ఏప్రిల్ 17:

కాకినాడ వాకలపూడి సెజ్‌లో ఉన్న ప్యారీ షుగర్స్ రిఫైనరీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (PSRIPL) యూనిట్ కార్యకలాపాలను నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. వరుసగా వస్తున్న ఆర్థిక నష్టాలు, నిర్వహణ సమస్యల కారణంగా ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.ఈ యూనిట్‌లో విదేశాల నుంచి దిగుమతి చేసిన ముడి చక్కెరను శుద్ధి చేసి మళ్లీ ఎగుమతి చేసే ప్రక్రియ కొనసాగేది. అయితే ప్రారంభం నుంచే ఈ ప్లాంట్‌కు సవాళ్లు ఎదురయ్యాయి. ముఖ్యంగా గ్యాస్ ఆధారంగా నడపాలని భావించిన యూనిట్‌ను, గ్యాస్ సరఫరా లేకపోవడంతో బొగ్గుతో నడపాల్సి రావడం వల్ల ఖర్చులు భారీగా పెరిగాయి.2015-16లో ఉత్పత్తి ప్రారంభమైన ఈ ప్లాంట్ మొదట రోజుకు 2,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేసింది. తర్వాత దాన్ని 3,000 మెట్రిక్ టన్నులకు పెంచే ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. అదనంగా 2021-22లో కార్యకలాపాలు నిలిచిపోవడం, 2022-23లో జరిగిన ప్రమాదాలు సంస్థను మరింత కుదేలు చేశాయి.షిప్పింగ్ ఆలస్యాలు కారణంగా భారీ జరిమానాలు విధించబడగా, మార్కెట్‌లో చక్కెర ధరలు పడిపోవడం కూడా సంస్థపై ప్రభావం చూపింది. ఈ పరిస్థితుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.1406 కోట్ల నష్టం చవిచూసిన కంపెనీ, మార్చి 31న జరిగిన బోర్డు సమావేశంలో ప్లాంట్ మూసివేతకు నిర్ణయం తీసుకుంది.ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌తో పాటు పరిశ్రమల శాఖ అధికారులకు యాజమాన్యం తెలియజేసింది. కాంట్రాక్ట్ కార్మికులు పనులకు హాజరు కావద్దని సూచించింది. మొత్తం మీద ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఈ యూనిట్ కొనసాగించడం సాధ్యం కాదని భావించి ప్లాంట్ మూసివేతకు దిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular