ePaper
Thursday, May 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంబస్ స్టేజీల్లో తప్పనిసరిగా ఆపాలి

బస్ స్టేజీల్లో తప్పనిసరిగా ఆపాలి

📰 Generate e-Paper Clip

 

 

ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు

ఆర్టీసీ ఆర్‌.ఎం అప్పలనాయుడు

విశాఖ దక్షిణం, పెన్ పవర్, మే 12 :

బస్సులను ప్రతి స్టేజీలో తప్పనిసరిగా ఆపాలని, ప్రయాణికులతో మర్యా దపూర్వకంగా వ్యవహ రించాలని ఏపీఎస్ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ సిబ్బందికి స్పష్టం చేశారు.డిపో మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, అసి స్టెంట్ ఇంజనీర్లు, అద్దె బస్సుల యజ మానులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయ న పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. బస్సులు స్టేజీ ల్లో ఆపకుండా వెళ్లిపోవడం, ప్రయాణికులతో దురు సుగా ప్రవర్తించడం వంటి ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సూపర్వైజర్లకు కఠిన సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి స్టేజీలో బస్సులు ఆగుతున్నాయా లేదా అన్న విషయంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, నిబం ధనలు ఉల్లంఘించిన సిబ్బందిపై తక్షణ చర్యలు తీసు కోవాలని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఇబ్బం దులు కలగకుండా సేవలను మరింత మెరుగు పర్చా లని సూచించారు.అదేవిధంగా “శక్తి” పథకం అమలు లోకి వచ్చిన తర్వాత విశాఖ రీజన్‌లో ఆక్యుపెన్సీ రేషియో రాష్ట్రంలోనే అ త్యధికంగా పెరిగిందని, ఎర్నింగ్స్ పర్ కిలోమీ టర్ కూడా గణనీయంగా మెరుగుపడిందని ఆర్‌ఎం తెలిపారు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రయాణికుల కు మరింత సౌకర్యవంత మైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular