ఖమ్మం, పెన్ పవర్, జూలై 20: ఖమ్మం నగరంలో వివేకానంద సేవా సమితి చైర్మన్ మోత్కూరి నారాయణరావు జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరక్ష హాస్పిటల్ అధినేత, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, డాక్టర్ జివి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ కార్యవర్గ సభ్యులు రుద్ర ప్రదీప్ లు కలిసి నారాయణరావుకు గజమాల వేసి, శాలువాతో ఘనంగా సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మోత్కూరి నారాయణరావు సమాజ సేవను లక్ష్యంగా చేసుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఆయురారోగ్యాలతో, ఆనంద సంతోషాలతో నిండి మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ షేక్ ఏడుకొండలు, రుద్ర ప్రతాప్, రాకేష్ దత్త, పిల్లలమర్రి వెంకట్, శ్యామ్, జగన్, ఊరుకొండ ఖాదర్ బాబు, గజ్జల శ్రీనివాస్, ఆర్ హెచ్ బి ఎస్ ఆర్ హెచ్ బృందం సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

