ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తాడలో అవగాహన కార్యక్రమం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తాడలో అవగాహన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

 

మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు అధికారులు

గంగవరం, పెన్ పవర్, జూన్ 5 :

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గంగవరం మండలంలోని కొత్తాడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, ప్రకృతి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని వక్తలు సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మొక్కలు నాటడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞ చేశారు. ప్రకృతిని కాపాడడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించవచ్చని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు.

 

.కార్యక్రమంలో కొత్తాడ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి ఇంచార్జ్ డిఎల్పిఓ కె. నర్సింగరావు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వెంకటరెడ్డి, పార్టీ నాయకుడు సుభాష్, భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షురాలు నీలాలమ్మ, బిజెపి నాయకురాలు సత్యనారాయణమ్మ, ఎంపీటీసీ సభ్యుడు పి. ఆదినారాయణ, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, ఎంపీడీవో లక్ష్మణరావు, ఉపాధి హామీ పథకం ఏపీడీ రాంబాబు, ఏపీఓ ప్రకాష్, జేఈ పద్మనాభం తదితరులు పాల్గొన్నారు.

.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular