గ్రామస్తుల వినతితో స్పందించిన అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్య
స్టాఫ్ రిపోర్టర్,పాడేరు/గూడెం కొత్త వీధి,పెన్ పవర్,జూలై 25: పాడేరు మండలం పాడేరు పంచాయతీ పరిధిలోని సుండ్రుపుట్టు గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభమయ్యాయి.గ్రామస్తులు ఆంధ్రప్రదేశ్ జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ డాక్టర్ వంపూరు గంగులయ్యను కలిసి సమస్యను వివరించారు. విషయం తెలుసుకున్న వెంటనే గంగులయ్య సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టెక్నీషియన్‌ను పంపించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.సోమవారం గ్రామంలో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శి పర్యటించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గంగులయ్య సూచించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ సమస్య మళ్లీ తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సత్వర స్పందనతో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టిన డాక్టర్ వంపూరు గంగులయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సీదరి రామ్మూర్తి, మజ్జి నగేష్, రాంబాబు, నాగు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

