గార్ల, పెన్ పవర్, జూలై 24:
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమని విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసిన వారికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ చింత రమేష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మెడికల్ సూపరిండెంట్ గా విధులు నిర్వర్తించి రీ డిప్లమెంటులో బదిలీపై ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి వెళ్తున్న క్రమంలో డాక్టర్ కుర్ర కొప్పుల శ్రీధర్ గౌడ్ కు మహబూబాబాద్ జిల్లా గార్ల మండల పరిధిలోని మర్రిగూడెం దేవస్థానం ప్రాంగణంలో శుక్రవారం కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది ఆత్మీయ వీడ్కోలు అభినందన కార్యక్రమం నిర్వహించి ఘనంగా సత్కరించి సన్మానించారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సూపరిండెంట్ డాక్టర్ శ్రీధర్ గౌడ్ తోటి ఉద్యోగులతో సమన్వయం చేసుకుంటూ ఏ దశలోను విమర్శలకు తావు లేకుండా సమర్థవంతంగా అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందాడని ఆయన సేవలను వారు కొనియాడారు. గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన కాలంలో సహకరించిన సీనియర్ డాక్టర్ వి హనుమంతరావు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ పారామెడికల్ సిబ్బంది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ శానిటేషన్ సిబ్బందికి డాక్టర్ శ్రీధర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు నాయక్, డాక్టర్ సతీష్, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ నాగేశ్వరరావు సీనియర్ నర్సింగ్ ఆఫీసర్స్ వి స్వాతి, మెర్సీ ఝాన్సీ రాణి ఐ రాణి నర్సింగ్ ఆఫీసర్స్, ఉపేందర్ ,రజిని స్వాతి ,వినీల సరిత, పారామెడికల్ సిబ్బంది బైరపాక శ్రీనివాస్, అశోక్ నరసయ్య దేవరాజు, ఉపేందర్ ఎల్లయ్య, ఉమాదేవి కల విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

