గార్ల, పెన్ పవర్, జులై28:
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. నిత్యం పందులు పంది పిల్లలతో కలిసిరోడ్లపై తిరుగాడుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు పందులు రోడ్లపై, జన నివాసాల చుట్టూ సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పందుల పెంపకందారులు పందులను బయటకు వదిలి వేయడంతోఇంటి పెరటిలో ఉన్న ఆకుకూరలు, పూల మొక్కలను పాడుచేస్తూ పరిసరాలను ఆశుభ్రపరుస్తున్నాయి. వీటి చేష్టలతో మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారుపలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వర్షాకాలంలో ఈ విధంగా పందుల సంచరిస్తే పలు వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పందుల సంచారం కారణంగా పిల్లలకు మెదడువాపు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైడ్ కాల్వలు గ్రామ పంచాయతీ చెత్తకుప్పల వద్ద రోడ్లపై పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్న క్రమంలో ద్విచక్ర వాహనదారులు పలుసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు.ముల్ల పోదలలో పందులు చనిపోయి దుర్వాసన వస్తోందని పందులు యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ ఆయా వార్డుల ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.ఇప్పటికై సంబంధిత పంచాయతీ అధికారులు స్పందించి గార్ల పట్టణంలో పందుల స్వైర విహారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ ప్రజలు కోరుతున్నారు.

