విశాఖపట్నం, పెన్ పవర్ జూలై 3 :
నగరంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్) నుంచి చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కాకినాడ జిల్లా తుని మండలం ఎస్.అన్నవరం పంచాయతీ పరిధిలోని కొత్త సురవరం గ్రామానికి చెందిన అదప అప్పారావు (70) ఈ నెల 22వ తేదీ సాయంత్రం కేజీహెచ్ ప్రాంగణం నుంచి కనిపించకుండా పోయినట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, అదృశ్యమైన సమయంలో అప్పారావు లైట్ గ్రీన్ రంగు హాఫ్‌హ్యాండ్స్ షర్ట్, బ్లూ కలర్ చెక్స్ లుంగీ ధరించి, ఎరుపు రంగు టవల్ వేసుకుని ఉన్నారు. అలాగే ఆయన కుడి చేతికి వైద్య చికిత్సలో భాగంగా క్యాన్యులా అమర్చి ఉంది.
అప్పారావు ఆచూకీ తెలిసిన వారు లేదా ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం కోసం ఐఓ 94934 36403, వన్‌టౌన్ ఎస్హెచ్ఓ 94407 96019 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు.

