గూడెంకొత్తవీధిలో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యం
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, ఆగస్టు 25: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడెంకొత్తవీధి మండలంలో సర్పంచ్, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శి బొబ్బిలి లక్ష్మణ్ తెలిపారు. పాడేరు ఎమ్మెల్యే, అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు నాయకత్వంలో అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ఓ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గిరిజన ప్రజలు ఇప్పటికీ గుర్తుంచుకున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. పాడేరు నియోజకవర్గంలో గత రెండు ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు అండగా నిలిచారని, అదే ఆదరణ రానున్న స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైసీపీ శ్రేణులంతా ఐక్యంగా, సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గెలుపును వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజుకు కానుకగా అందించాలని పార్టీ శ్రేణులను కోరారు.

