Homeతెలంగాణజాతీయ సదస్సును విజయవంతం చేయాలి

జాతీయ సదస్సును విజయవంతం చేయాలి

గార్ల మండల స్థాయి సమావేశంలో జిల్లా నాయకుల పిలుపు

గార్ల, పెన్ పవర్ ఆగస్టు 7:

సెప్టెంబర్ 9న వరంగల్‌లో నిర్వహించనున్న ఎంఆర్పీఎస్–ఎంఎస్‌పీ నూతన మండల కమిటీల జాతీయ సదస్సును విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్–ఎంఎస్‌పీ జిల్లా నాయకులు జన్ను దినేష్ ఏకు శంకర్ లు పిలుపునిచ్చారు. ఈ మేరకు గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో శుక్రవారం మండల ఇంచార్జ్ ఇరుగు రవీందర్ మాదిగ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు సామాజిక న్యాయం సాధన, ఎస్సీ వర్గీకరణ అమలు, మాదిగల హక్కుల పరిరక్షణ కోసం ఎంఆర్పీఎస్ ఉద్యమం నిరంతరం పోరాటం చేస్తోందన్నారు. వరంగల్‌లో జరగనున్న జాతీయ సదస్సు ఉద్యమ చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.గార్ల మండలంలోని ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువత, మహిళలు సదస్సుకు హాజరయ్యేలా ఇప్పటి నుంచే కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరు సదస్సు విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆరోగ్యశ్రీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్ పి కొరవి మండల ఇన్చార్జి దూడపంగు శ్రీనివాస్ బాసి పంగు జయరాజు గార్ల మండల నాయకులు కొత్తపల్లి వెంకన్న సిరిపంగి నారాయణ ఇల్లుటూరి శ్రీనివాస్ ఇమ్మడి వెంకన్న పుల్లూరు వెంకటేశ్వర్లు బొజ్జ బిక్షం పందుల కృష్ణ జిల్ల పల్లి వెంకటేశ్వర్లు అంకె పాక కిరణ్ కుమార్ బాసిపంగు చిరంజీవి చిలుకూరి పెద్ద వెంకన్న గిన్నారపు మురళి తారక రామారావు పందుల పృథ్వి గడ్డం శ్రీశైలం ఏలూరు సాయికుమార్ కాంపాటి హర్షవర్ధన్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular