Homeతెలంగాణమహిళా సాధికారత పై గ్రామసభ ఏర్పాటు

మహిళా సాధికారత పై గ్రామసభ ఏర్పాటు

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం లో బుధవారం మహిళా సాధికారత విద్య ఉపాధి ఆర్థిక స్వావలంబనపై సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించి మహిళా సాధికారత పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ బానోత్ పార్వతి నాయక్ మాట్లాడుతూమహిళలు విద్య, ఉపాధి, పరిశ్రమ రంగాల్లో సాధికారత సాధించినప్పుడే నిజమైన మహిళాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మహిళా శక్తి సంకల్పిస్తే ఏదైనా సాధించగలదని అన్నారు. మహిళలు విద్య, నైతిక విలువలు, రాజకీయ అవగాహన, స్వయం ఉపాధి రంగాల్లో ముందుకు సాగినప్పుడే ఆర్థికాభివృద్ధి, సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు. మహిళలు సంఘటితంగా ఉండి మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసుకోవాలని, స్థానిక సంస్థలు, చట్టసభల్లో మహిళల భాగస్వామ్యం పెరగాలని సూచించారు. ఈ గ్రామ సభలో గ్రామ అభివృద్ధి నిధుల వినియోగం ప్రజా సమస్యలపై టీజీఎస్ నాయకులు గిన్నారపు మురళీ తారక రామారావు మాట్లాడుతూగ్రామపంచాయతీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న నిధుల వివరాలను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలనిగ్రామపంచాయతీకి ఏఏ పథకాల కింద ఎంత మేర నిధులు మంజూరయ్యాయి, ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు, ఇంకా ఎంత నిల్వలో ఉంది, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను గ్రామసభలోనే ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని వారు కోరారు. గ్రామసభలు కేవలం తూతూ మంత్రంగా కాకుండా ప్రజల ప్రశ్నలకు సమాధానం లభించే వేదికగా ఉండాలన్నారు ప్రజలకు తెలుసుకునే హక్కు ఉందని, ప్రతి రూపాయి ఖర్చు లెక్కలను గ్రామసభలో వెల్లడించడం అధికారుల బాధ్యత అని పేర్కొన్నారు.గ్రామంలో తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధిదీపాలు తదితర సమస్యల పై అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీయడంతో కార్యదర్శి మధు నాయుడు అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను పారదర్శకంగా అందిస్తామని తెలిపారు. గ్రామ సభకు ఐకెపి అధికారులు గైర్హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జేరీనా వార్డు సభ్యులు తోడేటి శ్రీనివాస్ తాళ్లపల్లి కృష్ణ గౌడ్ సలగం నీలమ్మ సిపిఎం పార్టీ నాయకులు కందునూరి శ్రీనివాస్ ఏఎస్ఐ వెంకట్ రెడ్డి గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular