ఖమ్మం, పెన్ పవర్, ఆగస్టు 5:
డబ్బా పాలు వద్దు.. తల్లి పాలే ముద్దని హెచ్ ఓ డి డాక్టర్ బాబు రత్నాకర్ అన్నారు. ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తల్లిపాలు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తాయని తల్లిపాలను మించిన ఆహారం మరొకటి లేదన్నారు పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టించాలని బాలింతలకు గర్భిణీ స్త్రీలకు సూచించారు. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని తద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఉంటూ భవిష్యత్తులో సంభవించే పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుందని అన్నారు తల్లిపాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి వారం రోజులు తల్లిపాల వారోత్సవాలుగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నవజాత శిశువులకు తల్లిపాలు అమృత తుల్యమైనవని ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమ పౌష్టికాహారం తల్లిపాలేని సంపూర్ణ ఆరోగ్యంగా పుట్టిన పిల్లలకు వెంటనే తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అని ఆయన అవగాహన కల్పించారు అనంతరం తల్లిపాల ప్రాముఖ్యతపై నర్సింగ్ కళాశాలల విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ నరేంద్ర, ఆర్ ఎం ఓ అనిత గైనకాలజిస్ట్ మాధవి నర్సింగ్ సూపరిండెంట్ రత్నకుమారి, మేరీ రోజా మిల్క్ బ్యాంక్. మేనేజర్ రమ్య సిబ్బంది గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ పులిపాటి నర్సింగ్ కాలేజ్ కిన్నెర నర్సింగ్ కాలేజ్ విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

