Homeతెలంగాణశాతవాహన ఎక్స్ ప్రెస్ ను గార్లలో నిలుపుదల చేయాలి

శాతవాహన ఎక్స్ ప్రెస్ ను గార్లలో నిలుపుదల చేయాలి

 

గార్ల ,పెన్ పవర్ ఆగస్టు 1:

గార్ల రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ ప్రెస్ ను నిలుపుదల చేయాలని దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ కు కాంగ్రెస్ పార్టీ నాయకులు వినతిలో కోరారు. శనివారం సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్, సంబంధిత రైల్వే అధికారులకు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ తో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధనియాకుల రామారావు ఆధ్వర్యంలో గార్ల రైల్వే స్టేషన్ లో ఎగువ, దిగువ శాతవాహన ఎక్స్ ప్రెస్,లను నిలుపుదలకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా ఏజెన్సీ గార్ల రైల్వే స్టేషన్ లో వెంటనే నిలుపుదల చేయాలని ఎంపి పోరిక బలరాం నాయక్ రైల్వే అధికారులను ఫోన్ ద్వారా మాట్లాడి వినతి పత్రాన్ని పంపినట్లు వారు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు గార్ల రైల్వే స్టేషన్ ఒకే ఒక్క రైల్వే స్టేషన్ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నందున, శాతవాహన ఎక్స్ ప్రెస్ నిలుపుదల తో పాటు గార్ల రైల్వే స్టేషన్ ను అమృత్ భారత్ పథకం లో చేర్చి స్టేషన్ ను ఆధునికరించాలని విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు. ఈకార్యక్రమంలో నాయకులు ధనియాకుల రామారావు, గోసు నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular