చీరాల, సెప్టెంబర్ 28 : జాండ్రపేటలో జెండా గణేష్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది నిర్వహించే జెండా గణేష్ ఉత్సవాలు ఈ ఏడాది కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథునికి వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమానికి చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్రనాథ్ హాజరై గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ.. జాండ్రపేటలో జెండా గణేష్ ఉత్సవాల్లో పాల్గొని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ‘గణపతి బప్పా మోరియా’ అంటూ భక్తులు నినాదాలు చేస్తూ నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు.

