గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 2:
మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలను బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గార్ల మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ సమీపంలో గల వైయస్ఆర్ విగ్రహానికి సింగిల్ విండో చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతీ హతిరామ్ నాయక్ లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలతో, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని భౌతికంగా మనకు దూరం ఉన్నా, పథకాల ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భుక్యా నాగేశ్వరరావు మర్రిగూడెం సర్పంచ్ భూక్యరాంసింగ్ ఉప సర్పంచ్ మహమ్మద్ జరీనా కాంగ్రెస్ పార్టీ నాయకులు రహీం ఖాన్ షేక్ యాకుబ్ పాషా బాబూలాల్ కోల కుమార్ గౌడ్ దీకొండ రాము నెహ్రూ ఉస్మాన్ మండ రవి గౌడ్ షేక్ మౌలానా గుండ్లపల్లి నాగయ్య సైజాద్ ముత్యం పూర్ణ తదితరులు ఉన్నారు.

