జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సత్తా చాటిన వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు
వేటపాలెం, సెప్టెంబర్ 29 : బాపట్లలో ఆదివారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వేటపాలెం జడ్పీ హైస్కూల్ విద్యార్థినీలు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ప్రధానోపాధ్యాయురాలు దేవరకొండ సరోజినీ తెలియజేశారు. అండర్ -16 60 మీటర్ల పరుగు పందెంలో ఎల్. వైష్ణవి, కె. గాయత్రి ప్రథమ, ద్వితీయ స్థానాలు, లాంగ్ జంప్ లో ఎల్. వైష్ణవి, కె. గాయత్రి ప్రధమ, తృతీయ స్థానాలు, షాట్ పుట్ లో కె. గాయత్రి ప్రథమ స్థానం సాధించారు. వీరు అక్టోబర్ 1, 2 తేదీల్లో కర్నూల్ లో జరగబోవు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బాపట్ల జిల్లా తరఫున పాల్గొంటారు. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయులు జె. దేవ బిక్షం, జె. శ్రావణి, పాఠశాల స్టాప్, విద్యార్థులు అభినందనలు తెలియజేసి రాష్ట్రస్థాయి పోటీల్లో కూడా రాణించాలని బెస్ట్ విషెస్ తెలియజేశారు.

