గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 3:
పదేళ్ల పింక్ పార్టీ పాలన కంటే వెయ్యిరోజుల ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ పాలన భేష్ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య పిఎసిఎస్ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు గురువారం గార్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు తొలుత బాణాసంచా కాల్చి స్వీట్లను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు అనంతరం ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి పాలనను అస్తవ్యస్తం చేసిందని విమర్శించారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేదలకు ఉచిత సన్న బియ్యం రేషన్ కార్డులు స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఇందిరమ్మ ఇల్లు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు ప్రజలంతా గత పాలనలో ప్రస్తుత పాలనలో తమకు అందిన సంక్షేమాన్ని బేరీజు వేసుకొని ఆలోచించాలని సూచించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా గార్ల రాంపురం మధ్య పాకాల ఏటిపై వంతెన నిర్మాణం పూర్తి కాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేను వెంటనే వంతెన పనులను పూర్తిచేసే దిశగా చర్యలు చేపట్టడంతో పాటు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజలకు మేలు చేసే ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం నాయక్ ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భుక్యా నాగేశ్వరరావు గార్ల మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గంగావత్ రామ్ సింగ్ మర్రిగూడెం సర్పంచ్ భూక్య రాంసింగ్ చిన్న బంజర సర్పంచ్ మోతిలాల్ ముల్కనూర్ సర్పంచ్ వెంకటరావు సీతంపేట సర్పంచ్ వీర్య నాయక్ చిన్న కిష్టాపురం సర్పంచ్ వీరభద్రం గార్ల ఉపసర్పంచ్ మొహమ్మద్ జరీనా బేగం కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంషాద్ బేగం జిల్లా నాయకులు కట్ట శ్రీనివాస్ యాకుబ్ పాషా కత్తుల ప్రశాంత్ కోల కుమార్ గౌడ్ మోహిన్ అజ్మీరా బన్సీలాల్ మండల రవి గౌడ్ మల్లిబాబు పాలేరు వెంకటేశ్వర్లు వార్డు సభ్యులు సారయ్య తోడేటి శ్రీనివాస్ గౌడ్ రావుజి కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

