అశోక్‌నగర్‌లో పేరుకుపోయిన చెత్తకుప్పలు
పారిశుధ్య నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు
చెత్త తొలగింపుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడి విజ్ఞప్తి
కాప్రా, పెన్ పవర్, నవంబర్ 10:
అశోక్‌నగర్ కాలనీలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, రహదారులపై చెత్త పేరుకుపోతున్నా సంబంధిత సిబ్బంది పట్టించుకోవడం లేదని హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొకుట్ల రూపేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కాలనీలోని పలు ప్రాంతాల్లో చెత్త తొలగించకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అశోక్‌నగర్ కాలనీలో ఎంఎంసీ సూపర్‌వైజర్ లలిత విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పారిశుధ్య పనులు సక్రమంగా జరగడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయంపై ఇప్పటికే ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.
కాలనీలో ప్రతిరోజూ పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని జవాన్ గారికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులపై స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కొకుట్ల రూపేందర్ రెడ్డి కోరారు.

