Homeఆంధ్రప్రదేశ్పోలవరంచట్టి జంక్షన్‌లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

చట్టి జంక్షన్‌లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు

చింతూరు, పెన్ పవర్, ఏప్రిల్ 27:

 

చట్టి జంక్షన్ లో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించబడింది.చట్టి ఆటో యూనియన్‌కు చెందిన ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సి.ఐ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం, వేగ పరిమితులు మించకపోవడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని స్పష్టం చేశారు. అలాగే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఆటో డ్రైవర్లు జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పిస్తూ, రోడ్డు భద్రత అందరి బాధ్యత అని అన్నారు. ఈ అవగాహన సదస్సును ఆటో డ్రైవర్లు స్వాగతిస్తూ, భవిష్యత్తులో ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటిస్తామని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular