ePaper
Tuesday, May 5, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిశెట్టిపాలెం రామాలయం పునర్నిర్మాణానికి 80 లక్షలు మంజూరు

శెట్టిపాలెం రామాలయం పునర్నిర్మాణానికి 80 లక్షలు మంజూరు

📰 Generate e-Paper Clip

నర్సీపట్నం, పెన్ పవర్:

అనకాపల్లిజిల్లా మాకవరపాలెం మండలం శెట్టిపాలెంలో రామాలయం పునర్నిర్మాణానికి దేవాదాయ శాఖ నుండి 80 లక్షల నిధులు మంజూరయ్యాయి. వీటికి సంబంధించిన పత్రాలను మంగళవారం ఉదయం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మండల టిడిపి నాయకులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అందజేశారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో సిజిఎఫ్ నుండి దేవాదాయశాఖ నిధులు విడుదల చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల టీడీపీ అధ్యక్షులు ఆర్.వై. పాత్రుడు, అల్లు నాయుడు, రుత్తల నంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular