చింతూరు, పెన్ పవర్, మే 27
చింతూరు నుంచి వీఆర్‌పురం వెళ్లే ప్రధాన రహదారిలో ఎయిర్టెల్ టవర్ సమీపంలోని శబరి నదిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు సుమారు 55 సంవత్సరాలు ఉండవచ్చని, ఎత్తు సుమారు 5 అడుగులు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహంపై ఎటువంటి దుస్తులు లేకుండా ఉండటంతో కేసు అనుమానాస్పదంగా మారింది. మహిళ మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. సదరు మహిళను ఎవరైనా గుర్తుపట్టినట్లయితే వెంటనే చింతూరు పోలీసులను సంప్రదించాలని కోరారు. సంప్రదించవలసిన నంబర్లు: సిఐ చింతూరు, 8977191213 ఎస్ ఐ చింతూరు, 9281442983, 9599499366 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

