ePaper
Tuesday, June 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుశ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి క్రికెట్ టోర్నీ విజేతగా ముంచంగిపుట్టు

శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి క్రికెట్ టోర్నీ విజేతగా ముంచంగిపుట్టు

📰 Generate e-Paper Clip

ముంచంగిపుట్టు,పెన్ పవర్,జూన్‌ 2: మండలంలో ఉత్సాహంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా జరిగిన మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో ముంచంగిపుట్టు క్రికెట్ క్లబ్‌ (ఎంసీసీ) విజేతగా నిలిచింది. సుజనకోట పంచాయతీ పరిధిలోని సుజనపేట గ్రామంలో ఈ పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంచంగిపుట్టు జట్టు, బీట గ్రామ జట్టు మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరికి ముంచంగిపుట్టు జట్టు అద్భుత ఆటతీరుతో బీట జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.టోర్నమెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాయని నిర్వాహకులు తెలిపారు. విజేత జట్టుకు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేయనున్నట్లు పేర్కొన్నారు.విజేత జట్టు క్రీడాకారులను ముంచంగిపుట్టు సీనియర్‌ క్రికెటర్లు సర్ని సురేష్‌, జోషి, కిరణ్‌, మాజీ సర్పంచ్‌ వి.రమేష్‌ తదితరులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular