ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంబోలెరో వాహనం బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు

బోలెరో వాహనం బోల్తా 20 మందికి తీవ్ర గాయాలు

📰 Generate e-Paper Clip

  • చింతూరు, పెన్ పవర్, జూన్ 5:

మారేడుమిల్లి, చింతూరు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బోలెరో వాహనం బోల్తా పడడంతో సుమారు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం మేరకు, జి. మేడపాడు, గంటి పెద్దాపురం, జగంపేట ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది వివాహ కార్యక్రమానికి హాజరై చింతూరు వైపు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular