రంపచోడవరం, జూన్ 29 (పెన్ పవర్): పోలవరం జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం (జూన్ 30) రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. పదో తరగతి మరియు అంతకంటే పై చదువులు పూర్తి చేసిన యువతి, యువకులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6304634447 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

