నర్సీపట్నం, పెన్ పవర్:
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న 2.0 సూపర్ యాప్ ను నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ నాయకుల సమక్షంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ అంశాలు, పార్టీ కార్యకలాపాలను మరింత చేరువ చేసేలా జగనన్న 2.0 సూపర్ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు. పార్టీ శ్రేణులంతా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రజలకు చేరువ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, జడ్పీటీసీ గిరిబాబు, మండల ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, నాతవరం, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం మండలాలు, నర్సీపట్నం మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు లగుడు నాగేశ్వరరావు, కొరుపోలు పాణి శాంతారాం, ఏకా శివప్రసాద్, శానాపతి వెంకటరత్నం, చిటికెల వెంకటరమణ, జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, మండల బూత్ కమిటీ అధ్యక్షులు కోనేటి రామకృష్ణ, యలమంచిలి రఘురాం, రుత్తల వాసు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, సుర్ల నాయుడుబాబు, అల్లంపల్లి లావణ్య, వీరమాచినేని జగదీశ్వరి, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

