Homeతెలంగాణజి.ఓ నెం.3 ను పునరుద్ధరించి యధావిధిగా కొనసాగించాలి

జి.ఓ నెం.3 ను పునరుద్ధరించి యధావిధిగా కొనసాగించాలి

 

 

గార్ల, పెన్ పవర్, జూలై 25:

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం కేంద్రంలోని గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించేందుకు శనివారం రాంపురం గ్రామానికి వచ్చిన కొత్తగూడెం శాసనసభ్యులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనం నేని సాంబశివరావుకు జీవో నెంబర్ 03 ను యధావిధిగా కొనసాగించాలని రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ
తెలంగాణ గిరిజన సమాఖ్య కార్యదర్శి మలోత్ రవీందర్ నాయక్ ,భూక్యా హరినాయక్ లువినతి పత్రం అందజేశారు ఐదవ షెడ్యూల్లోని ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కల్పించి ఇక్కడి గిరిజన ఆదివాసుల యొక్క మనుగడ వారి సంస్కృతి ఆచార వ్యవహారాలు కట్టుబాట్లకు సంరక్షణ చేసే విధంగా ప్రభుత్వం చొరవ చూపి వారికి ప్రత్యేకoగా 100శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని జీవో నెంబర్ మూడు స్థానంలో మరొక జీవో ను తీసుకొచ్చి ఆదివాసి గిరిజనుల ఉనికికి పాటుపడాలని అలాగే రైతు రుణమాఫీ రెండు లక్షల లోపు మాఫీ కాని వారికి రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీని తక్షణం ప్రభుత్వం విడుదల చేయాలని ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో భూక్యా పూల్ సింగ్, బానోత్ కిషన్, డి.వీరన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular