Homeతెలంగాణపిఎన్ఎం రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు ప్రారంభం

పిఎన్ఎం రాష్ట్రస్థాయి పాటల శిక్షణ తరగతులు ప్రారంభం

 

గార్ల, పెన్ పవర్, జూలై 28:

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలను, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సంస్కృతిక రంగంలో వర్గ పోరాటాలను నిర్వహించాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నరసింహ అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో పిఎన్ఎం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పాటల శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నక్క సైదులు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో నరసింహ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతులను,కార్మికులను, కర్షకులను వర్గ పోరాటాలలోకి రానివ్వకుండా మతోన్మాద విధానాన్ని జోప్పిస్తుందని, సనాతన ధర్మం అంటూ కుల మతాల మధ్య చిచ్చు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్య పరచడం ప్రజనాట్యమండలి కర్తవ్యం అన్నారు. కళాకారులు తమ ఆటలు, పాటల ద్వారా ప్రజల్లో వర్గ చైతన్యం తీసుకురావడం కోసం నిరంతరం శ్రమించాలన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కళాకారులకు తమ గళమే ఒక ఆయుధంగా ఉపయోగపడుతుందన్నారు. తమ కలలను అస్త్రాలుగా చేసుకొని ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని, సంక్షేమ పథకాలు వారికి అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ముందుగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు అలవాల రామకృష్ణ ఎగురవేశారు.ఈ కార్యక్రమం లో ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ జే వినోద్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల ఆనంద్,రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల సదానందo, కొండూరి భాస్కర్,బూర్గుల ప్రభాకర్,నామ లక్ష్మీనారాయణ,బి. వీరాస్వామి,కె.శంకర్, సoగు నాగేంద్ర పవన్ కుమార్, మండల నాయకులు ఎల్లయ్య, వెంకన్న, వివిధ జిల్లాలకు చెందిన కళాకారులు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular