గార్ల, పెన్ పవర్, జూలై 31:
వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని డి ఎల్ పి ఓ స్వప్న అన్నారు. గత ఐదు రోజులుగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక లో 10 గ్రామపంచాయతీల లో నూతనంగా ఎన్నికైన 90 మంది వార్డు సభ్యులకు విధులు, బాధ్యతలు, పంచాయతీరాజ్ చట్టంపై గత ఐదు రోజుల నుండి కొనసాగుతున్న రెండవ విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె పాల్గొని మాట్లాడారు గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలపై వార్డు సభ్యులకు శిక్షణ ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు, సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు వెల్లడించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మంగమ్మ శిక్షణ అధికారులు అజీమ్ రవికుమార్ శ్రీకాంత్ మురళి వెంకటేష్ 10 గ్రామపంచాయతీల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

