Homeతెలంగాణఎంపీడీవోకు ఫీల్డ్ అసిస్టెంట్ లు వినతి

ఎంపీడీవోకు ఫీల్డ్ అసిస్టెంట్ లు వినతి

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 1:

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఏ పీ ఓ ఈ సి టి ఏ సి ఓ ఉద్యోగులు పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ రాష్ట్రస్థాయి యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా జూలై 31 నుండి ఆగస్టు 4 వరకు పెన్ డౌన్ షట్ డౌన్ పేరుతో నిరసన తెలుపుతూ నిర్వహిస్తున్న సమ్మెలో గార్ల మండల పరిధిలోని 20 గ్రామ పంచాయతీలలోని ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొనడం లేదని వారు నిర్వహిస్తున్న ధర్నాతో సమ్మెతో మాకు ఎటువంటి సంబంధం లేదంటూ మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో మంగమ్మకు శనివారం ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ అధ్యక్షులు హనుమంతు ఫీల్డ్ అసిస్టెంట్ లతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈజీఎస్ లోని ఫీల్డ్ అసిస్టెంట్ లు మినహా మిగతా ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు కూడా ఈ సమ్మెలో పాల్గొనడంలేదని విధి నిర్వహణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గార్ల మండల ఫీల్డ్ ఉపాధ్యక్షులు మేకల లక్ష్మి ,మాధురి, సంఘం సభ్యులు ఆంగోత్ శంకర్ ,రాంబాబు, రామ్ లాల్ ,సుధాకర్, యేసు ,భూక్య హరికిషన్ ,లాల్ ,మల్లికార్జున్ ,మత్రు ,వీరు ,కిషన్ ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular