Homeతెలంగాణవిశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రావూరి ప్రశాంత్ ఎన్నిక

విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా రావూరి ప్రశాంత్ ఎన్నిక

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 4:

 

మహబూబాబాద్: తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్ట్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా రావూరి ప్రశాంత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కేంద్రంలో మాజీ అధ్యక్షుడు గుండోజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సంఘం అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికల్లో దూదికట్ల రవీంద్రాచారి కార్యదర్శిగా, దేవరకొండ చంద్రభాను కోశాధికారిగా ఎన్నికయ్యారు. గుండోజు శ్రీనివాస్ గౌరవ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఉపాధ్యక్షులుగా దూదికట్ల రామాచారి, సిరికొండ విక్రం, సహాయ కార్యదర్శులుగా పోతుగంటి సతీష్, వెలగలేటి కిరణ్, ధరసోజు బాలకృష్ణ ఎన్నికయ్యారు.ముఖ్య సలహాదారులుగా గుండోజు దేవేందర్, వీరేంటి ముకేశ్, శ్రీపాద శ్రీనివాసచారి, బాణాల భిక్షపతి, గుండోజు సుబ్రహ్మణ్యం ఎన్నికయ్యారు. సభ్యులుగా చామర్తి వినయ్, కట్ట మహేంద్రచారి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రావూరి ప్రశాంత్ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల అభివృద్ధి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టులు అభివృద్ధి చెందితేనే సమాజంలోని సమస్యల పరిష్కారానికి మరింతగా దోహదపడగలరని అన్నారు. ఈ బాధ్యత తనకు అప్పగించినందుకు ఆనందంగా ఉందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.నూతన కమిటీకి జిల్లా వ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు, జర్నలిస్ట్ సంఘాలు, పురప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular