మధుయాష్కి గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపిన బాలకృష్ణ
బాలకృష్ణను సన్మానించిన మధుయాష్కి
ఎల్బీనగర్, పెన్ పవర్, ఆగస్టు 21:
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చింతలకుంట డివిజన్ నూతన అధ్యక్షులుగా ముక్కపల్లి బాలకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్సీ సెల్ చైర్మన్, మానాకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ ముక్కపల్లి బాలకృష్ణ పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ను ఆయన నివాసంలో కలిసి శాలువతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా చైర్మన్ గా నియమితులైన ముక్కపల్లి బాలకృష్ణను మధుయాష్కి గౌడ్ శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం ముక్కపల్లి బాలకృష్ణ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజలను, నాయకులను కలుపుకుపోయి పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. తనను ఎస్సీ సెల్ చైర్మన్ గా నియమించినందుకు స

