Homeతెలంగాణగిరిజన యువతి హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన

గిరిజన యువతి హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో ప్రదర్శన

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 4:

ఆదివాసీ గిరిజన యువతి, ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శిరీషపై హత్యాచారానికి పాల్పడి హత్య చేసిన నిందితుడు షాన్ ఉల్లా ఖాన్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం గార్ల మండల కేంద్రంలోని నెహ్రూ సెంటర్‌ అమరవీరుల స్తూపం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, మాజీ వైస్‌ ఎంపీపీ కట్టెబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ శిరీషను హత్య చేసిన నిందితుడిని ఎలాంటి జాప్యం లేకుండా అరెస్టు చేసి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శిరీష కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఆర్థిక సాయం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.మహిళలపై హింస, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని, మహిళా రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన అన్నారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు.ఈకార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, నాయకులు భూక్యా హరినాయక్, ధూపాటి జనార్ధన్, భీముడు, భూక్యా ఫూల్‌సింగ్, లోకేష్, రాజేష్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular