Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజురింతాడ పంచాయతీలో సెప్టెంబర్ 7 సోమవారం పీజీఆర్ఎస్

రింతాడ పంచాయతీలో సెప్టెంబర్ 7 సోమవారం పీజీఆర్ఎస్

  • గూడెం కొత్త వీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 5:రింతాడ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సెప్టెంబర్ 7వ తారీకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పంచాయతీ పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) కార్యక్రమం నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి రెవెన్యూ, హౌసింగ్, ఉపాధి హామీ, ఆరోగ్యం, ఇరిగేషన్, విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల మండల స్థాయి అధికారులు హాజరుకానున్నారు. గ్రామాల్లోని వివిధ సమస్యలను ప్రజలు నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, పీసా కమిటీ సభ్యులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువతతో పాటు అన్ని గ్రామాల ప్రజలు హాజరై తమ సమస్యలను తెలియజేయాలని అరుణ్ కుమార్ కోరారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular