- ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పాడేరులో అవార్డుల ప్రదానం
- గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలం నుంచి ఏడుగురు ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. శుక్రవారం పాడేరులో నిర్వహించే కార్యక్రమంలో వారికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు, సన్మానం అందజేయనున్నారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా కే. సుమిత్రా, ఎం. స్వరూపారాణి, డి. సీమ, పి. రామకృష్ణ, డి.వి. కాలేశ్వరరావు, వి. భగీరధి, జి. కామేశ్వరరావు ఎంపికయ్యారు.విద్యార్థుల విద్యాభివృద్ధికి, బోధనా రంగంలో అందిస్తున్న సేవలను గుర్తించి వీరిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్లు సమాచారం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు అందుకోనున్న ఉపాధ్యాయులకు పలువురు అభినందనలు తెలిపారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఏడుగురి ఎంపిక
RELATED ARTICLES

