Homeఆంధ్రప్రదేశ్గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి

  • అడవితల్లి బాటతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు
  • అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్
  • స్టాఫ్ రిపోర్టర్ ,పాడేరు/ పార్వతీపురం,పెన్ పవర్, సెప్టెంబర్ 13: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందని, ఇందులో భాగంగా ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, అటవీ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గొర్లే వీర వెంకట్ అన్నారు. ‘అడవితల్లి బాట’ పేరుతో మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం ద్వారా రవాణా ఇబ్బందులు తగ్గే అవకాశం ఏర్పడుతోందన్నారు. నడకకు కూడా ఇబ్బందిగా ఉన్న ప్రాంతాలకు రహదారులు, మౌలిక వసతులు అందుబాటులోకి తీసుకురావడంపై పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని తెలిపారు. పాడేరు నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో గిరిజన యువత పవన్ కళ్యాణ్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరుతున్నారని గొర్లే వీర వెంకట్ తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు కేటాయించే స్థానాల్లో విజయానికి క్షేత్రస్థాయిలో సమష్టిగా పనిచేస్తామని అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయుల సమావేశంలో రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్, పాడేరు జనసేన పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ వంపూరు గంగులయ్య ఆధ్వర్యంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదల నాగబాబు, అరకు పార్లమెంట్ కోఆర్డినేటర్ కొనకల రవికుమార్, ఏడు నియోజకవర్గాల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular