Homeతెలంగాణఖమ్మంఅప్పారావు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల అండ

అప్పారావు కుటుంబానికి కాంగ్రెస్ నాయకుల అండ

 

 

ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 6 :

ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్డు 28వ వార్డుకు చెందిన కోసూరి అప్పారావు కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు

ఈ సందర్భంగా అప్పారావు కుటుంబానికి ఆర్థిక సాయం అందించడంతో పాటు నిత్యావసర సరుకులను అందజేశారు. కుటుంబానికి అవసరమైన సమయంలో కాంగ్రెస్ నాయకులు అండగా ఉంటారని, భవిష్యత్‌లోనూ అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్, నూకల రామ్మోహన్ రెడ్డి, కొట్టం శిరిషా రంజిత్ రెడ్డి, ప్రదుమ్న చారి, మిర్యాల నరుణ్ తేజ్, రెబ్బగొండ్ల గోపీ, అక్కినేపల్లి దేవయ్య చారి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular