Homeతెలంగాణఖమ్మంగోళ్లపాడులో కాంగ్రెస్‌కు భారీ బలం బీఆర్ఎస్‌కు షాక్

గోళ్లపాడులో కాంగ్రెస్‌కు భారీ బలం బీఆర్ఎస్‌కు షాక్

 

మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ పాలనకు ఆకర్షితులై 30 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక

ఖమ్మం,పెన్ పవర్, నవంబర్ 2

ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 కుటుంబాలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్ తుంబూరు దయాకర్‌రెడ్డి నూతనంగా పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందించేందుకు మంత్రి పొంగులేటి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని అన్నారు.ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేయడంతో పాటు రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. గోళ్లపాడు గ్రామంలో గతంలో ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంతర్గత రహదారులు, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు మంత్రి పొంగులేటి చొరవతో పూర్తికావడం అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నాయకత్వానికి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, రాబోయే రోజుల్లో మరింత మంది కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఆటో యూనియన్ అధ్యక్షుడు గడ్డమీద ఉపేందర్, మాజీ ఉపసర్పంచ్ దొంతిసర్పు రాంబాబు, మాజీ వార్డు సభ్యుడు చీకటిమళ్ల లక్ష్మీనారాయణ, గౌడ సంఘం నాయకుడు మడికంటి శ్రీను, బీఆర్ఎస్ యువజన అధ్యక్షుడు రుద్ర మధు, ఎస్సీ నాయకుడు పొన్నెకంటి రాంబాబు తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, మండల నాయకులు మద్ది వీరారెడ్డి, మద్ది కిషోర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు రుద్ర ఉపేందర్, తేజావత్ పంతులు నాయక్, మద్ది వెంకటరెడ్డి, మందటి వెంకటరెడ్డి, శాబాదు మాధవరెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular