ePaper
Sunday, May 24, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్స్వచ్ఛ రథంతో...పల్లెలు పరిశుభ్రం..

స్వచ్ఛ రథంతో…పల్లెలు పరిశుభ్రం..

📰 Generate e-Paper Clip

ఎంపీపీ కందుల వెంకటయ్య 

పుల్లల చెరువు పెన్ పవర్ మార్చి 23

గ్రామాల్లో చెత్త సేకరణ నిమిత్తం కూటమి ప్రభుత్వం స్వచ్ఛ రథం ప్రవేశ పెట్టిందనీ ఎంపీపీ కందుల వెంకటయ్య అన్నారు.గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో పుల్లల చెరువు మండల పరిషత్ కార్యాలయం ఆవరణంలో సోమవారం స్వచ్ఛ రథాన్ని ఎంపీపీ కందుల వెంకటయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రతను పెంపొందించేందుకు ఈ స్వచ్ఛ రథం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.గ్రామ గ్రామాలకు వెళ్లి చెత్తను సేకరించడం మాత్రమే కాకుండా, సేకరించిన చెత్తకు బదులుగా ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు.గ్రామాల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా, స్వచ్ఛ రథానికి అప్పగించే అలవాటు పెంపొందితే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, తడి చెత్త–పొడి చెత్తగా విభజించే పద్ధతిని ప్రజలు అలవరచుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన గ్రామాలు అభివృద్ధికి పునాది అని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిశుభ్రతను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మరియదాస్,పుల్లల చెరువు మండల టీడీపీ అధ్యక్షులు పోట్ల గోవిందు,టీడీపీ సీనియర్ నాయకులు రెంటపల్లి సుబ్బారెడ్డి, పుల్లల చెరువు సొసైటీ చైర్మన్ పాత కోటి రామిరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షులు పల్లపాటి బాదరయ్య,జనసేన మండల పార్టీ అధ్యక్షులు కోటారి అచ్చయ్య,డిప్యూటీ ఎంపీడీవో హనుమంతరావు,జీఎస్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీవో చక్రవర్తి, ఏపీఓ మోషే,పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆత్మ నాయుడు, టీడీపీ నాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular